వివాహబంధంలోకి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్..
Cinema News: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆమిర్ .. భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని ఆమిర్ నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుక అతికొద్ది బంధువుల మధ్య జరిగింది. ఈ వేడుకలో ఆమిర్ కుమారులు జునైద్ కాన్, ఆజాద్ రావ్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్ ఉన్నారు. అంతేకాక.. గౌరీ స్ప్రాట్ తనయుడు కూడా ఉన్నాడు. వీరందరి సమక్షంలో ఇరువురు పత్రాలపై సంతకాలు చేసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఆమిర్ గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. మరోవైపు గౌరీకి కూడా గతంలో వివాహమైంది. ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అమిర్ , గౌరీతో రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. గౌరీతో అమిర్కు 25 ఏళ్ల స్నేహమున్నట్లు సమాచారం.
Cinema News : Jailer 2: రిలీజ్ డేట్ ఫిక్స్..