కామారెడ్డిలో ఘనంగా టిజెఎ 12వ వార్షికోత్సవం
కామారెడ్డి (CLiC2NEWS): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవాన్ని కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎన్ యూజే (ఐ) అనుబంధ టిజేఏ జర్నలిస్టులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం దేవునిపల్లి జెడ్పిహెచ్ ఎస్ విద్యార్థులకు పెన్నులను పంపిణీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవే జర్నలిజం పరమావధి అని, జర్నలిజం అనేది కేవలం వార్తలు రాయడం మాత్రమే కాదని, సమాజానికి నిజాలను చేరవేయడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించడం జర్నలిస్టుల బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్, ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్, కార్యవర్గ సభ్యుడు డి. రాజలింగం, టిజేఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల నీలకంఠం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొడకల గోవర్ధన్, టిజేఏ ప్రతినిధులు శ్రీధర్, సుందర్, శ్రీనివాస్, అమృత్ రావు, అరవింద్, మోహన్, నవీన్, మారుతి, రాజేందర్ రావు, ఫర్వేజ్, ఎల్లన్న, నక్క సిద్దిరాములు, వినోద్, సాయిలు, యాదన్న, రేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు.