భారత్‌లో కొత్తగా 20,346 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కి చేరింది. ఇందులో 1,00,16,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,28,083 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 222 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,50,336కి చేరింది.