భారత్లో కొత్తగా 9,110 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. అలాగే మరో 14,016 మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 1,05,48,521కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 78 మంది మృత్యువాతపడ్డారు. కాగా ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 1,55,158కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,43,625 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్లో పేర్కొన్నారు.