మహారాష్ట్రలో కొత్త‌గా 25,833 ‌కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 25,833 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు గురువారం సాయంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి మహా­రా­ష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కరోనా కేసుల సంఖ్య 23,96,340కు పెరిగింది. అలాగే తాజాగా రాష్ట్రంలో 58 మర­ణాలు నమో­ద­య్యాయి. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో మర­ణాల సంఖ్య 53,138కు చేరింది. కేవ‌ల‌యం రాజ‌ధాని ముంబ‌యిలో గురువారం ఒక్క‌రోజే 2,877 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా గత 24 గంటల్లో 12,764 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,75,565కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,66,353 యాక్టివ్ ‌కేసులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.