దేశంలో కొత్తగా 68,020 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,664కి చేరింది. వీటిలో 1,13,55,993 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,21,808 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో భారత్లో 291 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,843కి చేరిందని అధికారులు తెలిపారు.