మళ్లీ పెరిగిన బంగారం ధర
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 45,710 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 41,900 కు చేరింది. వెండి ధర మాత్రం భారీగా నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.