ఖమ్మం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఖమ్మం నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీక్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పొక్లెయిన్ సాయంతో లారీ, బస్సును వేరు చేసి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ ఐ రాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
