ఎపిలో కొత్తగా 1184 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1184 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. వీటిలో 8,87,434 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7217కి చేరింది.
జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపూర్‌లో 66, చిత్తూరులో 115, తూర్పు గోదావరిలో 26, గుంటూరులో 352, కడపలో 63, కృష్ణాలో 113, కర్నూలు 64, నెల్లూరులో 78, ప్రకాశంలో 45, శ్రీకాకుళంలో 47, విశాఖపట్నంలో 186, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 11 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,50,83,179 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
