ప్రముఖ సీనియర్ నటి శశికళ కన్నుమూత

ముంబ‌యి: ప్రముఖ సీనియర్ నటి శశికళ ఏప్రిల్ 4న ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ముంబ‌యిలోని కొలాబాలో ఆమె మరణించారు. శశికళ వందకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో పని చేశారు. శశికళ ఆగస్టు 1932 లో సోలాపూర్ లో జన్మించారు. డాకు, రాస్తా, కబీ ఖుషీ కబీ ఘామ్ వంటి చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి నటించిన ముజ్సే షాదీ కరోగి, 1953లో విడుదలైన తీన్‌ బత్తి చార్‌ రాస్తా, 1968లో విడుదలైన టీన్ బహురానియన్ వంటి తదితర చిత్రాలలో శశికళ నటించారు.

Leave A Reply

Your email address will not be published.