షేక్.బహర్ అలీ: సొరకాయ రసంతో గుండె జబ్బులకు చెక్

సొరకాయ రసంతో గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చును. సొరకాయ దీనిని అనపకాయ కూడా అంటారు. దీనిని పప్పులో కానీ, లేదా చిన్నచిన్న ముక్కలుగా చేసి కొద్దిగా చనగా పప్పు కలిపి రెండు టమాటాలు కలిపి వండి, చపాతీలో కానీ జొన్నరొట్టెలో కానీ కలుపుకొని రాత్రిపూట వారానికి 3 సార్లు తింటే మలబద్దకం, గ్యాస్, ఎసిడిటి, బీపీ, వేస్ట్ కొలెస్ట్రాల్ అంత తగ్గుతుంది. uric acid మరియు స్థూలకాయం కూడా చక్కగా తగ్గుతారు. ఎండాకాలంలో సొరకాయ కూర గానీ జ్యూస్ కానీ తాగితే శరీర తాపం తగ్గుతుంది. దాహం త్వరగా వేయదు, అలసట త్వరగా రాదు. సొరకాయ రసం రోజుకు రెండు సార్లు లేదా ఒకసారి చొప్పున 5 నెలలు తాగితే గుండె ధమనుల్లో ఏర్పడిన (బ్లాకెజిలు) అవరోధాలన్ని తొలిగిపోతాయి. గాభరా నివారించబదుతుంది. గుండె నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ నియంత్రించబడతాయి. గుండె యధావిధిగా తన పని తాను ఏ ఆటంకం లేకుండా, “చరైవేతి చరైవేతి” అనే మూలమంత్రంతో చక్కగా పనిచేస్తుంది. రక్తప్రసరణ చక్కగా జరిగి గుండె జబ్బులు, హై బీపీ రాకుండా ఉంటుంది. ఆమ్లపిత్తం, ఆంత్ర వ్రణ, కూడా తగ్గిపోతుంది. ప్రేవులు, పక్వాశ‌న, కాలేయం, ఆమాశ‌యం, ప్లీహనికి శక్తి లభిస్తుంది. హిమోగ్లోబిన్ చక్కగా పెరుగుతుంది. స్త్రీలకు రుతు సంబంధిత జబ్బులు నెలసరి స్రావం ఎక్కువ అవ్వటం, పైల్స్‌, జీర్ణవ్యవస్థకి సంబందించిన జబ్బులు అన్ని తగ్గుతాయి.

సొరకాయ రసం త‌యారీ..

సొరకాయని వేడినీటిలో చిటికెడు ఉప్పు వేసి బాగా కడిగి… పై పొట్టు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి 100 గ్రాముల రసం తీయాలి. ఈ రసంలో 7 తులసి ఆకులు, 5 పుదీనా ఆకులు, మెత్తగా నూరి దీనిలో కలపాలి. ఈ పానియాన్ని, ఉదయం/సాయంత్రం టిఫిన్ కి గంట ముందు, లేదా భోజనానికి రెండు గంటల ముందు ఈ రసాన్ని తాగాలి. సొరకాయ రసం తాగితే విరోచనాలు అయితే టీ గ్లాస్ రసం మాత్రమే తాగాలి. భయపడవసలసిన అవసరం లేదు.. ఇది సహజసిద్ధమైనది.

హెచ్చరి: ఆస్తమా, సైనస్, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు దీనిని తాగరాదు.

షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.