CBSE పదో తరగతి పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఈ పరీక్షలపై జూన్లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డు పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా అధికారులతో సమీక్షించారు.
“ దేశంలో మహమ్మారి ఉధృతి.. స్కూళ్ల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకునొ మే 4 నుంచి జరగాల్సిన సిబిఎస్ ఇ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్ 1 తర్వత సమీక్షించి నిర్ణయం తీసుకంటాం. పరీక్షలు ప్రారంభానికి 15 రోజుల ముందుగానే వివరాలు ప్రకటిస్తాం“ అని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
Students of Class 10 to be promoted on basis of internal assessment. If a student is not satisfied with the assessment then he/she can appear for the examination once the situation (#COVID19) is normal: Union Education Minister Ramesh Pokhriyal Nishank to ANI pic.twitter.com/B8okmzZowe
— ANI (@ANI) April 14, 2021