`సిఎం గారు త్వరగా కోలుకోవాలి`
హైదరాబాద్: హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే… ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలుపుతూ రాష్ట్ర మంత్రి, సీఎం తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.
ఇక సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు, కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను -చిరంజీవి
కెసిఆర్ గారు తొందరగా కోలుకోండి సర్. మీకోసం ప్రార్థిస్తున్నాను. -మహేష్ బాబు
కెసిఆర్‌గారు త్వరగా కోలుకోవాలి – తమన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను -బండ్ల గణేశ్
మన ముఖ్యమంత్రి కెసిఆర్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా -శ్రీనువైట్ల