తాగునీటి వృథాపై జలమండలి సీరియస్
హైదరాబాద్(CLiC2NEWS): అవగాహనా లోపమా.. లేక నిర్లక్ష్యమా..!?
జలమండలి అధికారులు జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి .. నీటిని వృథా చేస్తున్న ఐదుగురికి జరిమానా విధించారు. జరిమానా విధించడం జలమండలి లక్ష్యం కాదు… నీటి వృథాను అరికట్టడమే లక్ష్యమని జలమండలి స్పష్టం చేసింది. ఇకనుండి నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. రెండోసారి పట్టుబడితే నీటి కనెక్షన్ తొలగించనున్నట్లు తెలిపారు.
ప్రజలకే కాదు.. జలమండలి వ్యవస్థలో నీటి వృథాకూ చెక్ పెట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. లీకేజీ గుర్తిస్తే 24 గంటల్లో మరమ్మతు జరిగే చర్యతీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అధికారులపైనా చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నీటిని వృథా చేస్తే… రేపటి పరిస్థితి ఏంటి..? ఒకవైపు ఎల్-నినో.. వర్షాభావ పరిస్థితులు… ఇటు ఖాళీ అవుతున్న మంజీరా.. సింగూరు.. మరోవైపు నీటి అవసరాలు పెరుతున్నాయని, నీటిని పొదుపుగా వాడాలని, ఒక్క చుక్కనూ వృథా చేయొద్దు.. అంటూ జలమండలి పదేపదే అవగాహన కల్పిస్తోంది. అయినా కొందరిలో మార్పు రావడం లేదు…!
తాగునీటితో ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, నల్లాలు తెరిచి వదిలేయడం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిండినా పట్టించకపోవడం వంటివి జరిగితే చర్యలు తప్పవని ప్రకటన ద్వారా హెచ్చరిస్తున్నారు.
అవగాహన లేకనా.. !? లేదా ఉదేశ్యపూర్వకంగా చేస్తున్నారా..!??
మొదట్లో అవగాహనా కల్పించారు.. అనంతరం హెచ్చరించారు. వినకంటే మొదట్లో రూ. 1000 జరిమానాలు విధించారు. ఇలా రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేల వరకు జరిమానాలు విధించినా సరే నీటి వృధా ఆగడంలేదు. ఈ రోజు మనం వృథా చేసే ప్రతి నీటి చుక్క… రేపు మరొకరి తాగునీటి అవసరం కావచ్చు..! జరిమానా విధించడం జలమండలి లక్ష్యం కాదు… నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం.
నీరు ఉంటేనే నగరానికి భరోసా. మార్పు మన నుంచే మొదలవ్వాలి. నీటిని వృథా చేయకండి.. బాధ్యతగా వినియోగించండి.
ఈ పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడండి.. ఒక్క చుక్కనూ వృథా చేయొద్దు.. అంటూ జలమండలి పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వినియోగదారుల వైఖరిలో మార్పు రాకపోవడంపై జలమండలి ఆందోళన వ్యక్తం చేసింది.
తాగునీటితో ఫ్లోర్లు, వాహనాలు కడగడం, అవసరం లేకున్నా నల్లాలను తెరిచి ఉంచడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిపోయి నీరు పొంగిపోతున్నా పట్టించుకోకపోవడం వంటి చర్యల వల్ల విలువైన తాగునీరు వృథా అవుతోందని జలమండలి పేర్కొంది.
మొదట అవగాహన కల్పించాం.. హెచ్చరించాం.. అయినా మార్పు రాకపోవడంతో జరిమానాలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జలమండలి తెలిపింది. గతంలో రూ.1,000 నుంచి ప్రారంభించి, ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేల వరకు జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నప్పటికీ కొందరిలో ఇంకా బాధ్యత కొరవడుతోందని పేర్కొంది.
జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు:
తాగునీటి వృథాను అరికట్టే చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం నీటి సరఫరా సమయంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తాగునీటిని అనవసరంగా వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించి నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.
తనిఖీల సందర్భంగా రోజువారీ పనుల్లో కేవలం ఒక్క నిమిషంలోనే ఎంత నీరు వృథా అవుతుందో వివరించే కరపత్రాలను చూపిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పించారు. పలువురు వినియోగదారులు నీటి వినియోగంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. నీటి వృథాను అరికట్టేందుకు జరిమానాలు విధించడం అవసరమైన చర్యేనని కొందరు వినియోగదారులు స్వయంగా అభినందించారు.
ఈ రోజు మనం నిర్లక్ష్యంగా వృథా చేసే ప్రతి నీటి చుక్క.. రేపు మరొకరి తాగునీటి అవసరం కావచ్చు. జరిమానాలు విధించడం జలమండలి లక్ష్యం కాదు.. నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం. పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జలమండలి స్పష్టం చేసింది.
ఇకపై తనిఖీలు ముమ్మరం.. రెండోసారి పట్టుబడితే కనెక్షన్ తొలగింపు:
తాగునీటి వృథాపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జలమండలి హెచ్చరించింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా సమయాల్లో ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది.
తాగునీటిని వృథా చేస్తూ మొదటిసారి పట్టుబడిన వారికి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని, అదే వినియోగదారుడు రెండోసారి నీటిని వృథా చేస్తూ పట్టుబడితే సంబంధిత నీటి కనెక్షన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని జలమండలి స్పష్టం చేసింది.
ప్రజలకే కాదు.. జలమండలి వ్యవస్థలో నీటి వృథాకూ చెక్:
ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్న జలమండలి.. తన వ్యవస్థలో జరిగే నీటి వృథాను అరికట్టడంపైనా అంతే బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయించింది.
జలమండలి పరిధిలో సుమారు 15 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించిన తాగునీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉండగా, పైప్‌లైన్ లీకేజీల కారణంగా విలువైన తాగునీరు వృథా కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.
ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ గుర్తించిన వెంటనే స్పందించి, గరిష్ఠంగా 24 గంటల్లోగా లీకేజీని అరికట్టి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. తరచూ లీకేజీలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, వాటి మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని స్పష్టం చేసింది.
నీటిని వృథా చేయొద్దని ప్రజలకు చెబుతున్నప్పుడు.. జలమండలి కూడా తన వ్యవస్థలో ఒక్క చుక్క నీరు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజల నీటి వృథాపై ఎంత కఠినంగా వ్యవహరిస్తామో.. పైప్‌లైన్ లీకేజీల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపైనా అంతే కఠినంగా వ్యవహరిస్తాం. లీకేజీ తెలిసినా నిర్ణీత సమయంలో స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవు.. అని హెచ్చరించింది.
ప్రతి చుక్కకూ బాధ్యత:
నీటి పొదుపు ప్రజల బాధ్యత మాత్రమే కాదు.. జలమండలి బాధ్యత కూడా. ప్రజలు తమ ఇళ్ల వద్ద నీటిని వృథా చేయకుండా బాధ్యతగా వినియోగించాలి. జలమండలి తన పైప్‌లైన్ వ్యవస్థలో లీకేజీల ద్వారా నీటి నష్టం జరగకుండా జలమండలి చర్యలు తీసుకుంటుంది.
ప్రజల నిర్లక్ష్యమైనా.. వ్యవస్థలో లీకేజీ అయినా.. నీటి వృథా ఎక్కడ జరిగినా అరికట్టడమే జలమండలి లక్ష్యం.
నీటిని వృథా చేయొద్దు.. అవసరమైనంత మాత్రమే వినియోగించండి. ప్రతి చుక్కను కాపాడుదాం.. నగర తాగునీటి భద్రతకు భరోసా కల్పిద్దాం.
Also Read: రూ.4 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకృతుడైన లంబోదరుడు