TS: వ‌రంగ‌ల్‌లో ఘోర ప్ర‌మాదం

ఆర్టీసీ బస్సును ఢీకొన్న‌ ఇసుక లారీ.. 20 మందికి గాయాలు

వరంగల్‌ (CLiC2NEWS) : జిల్లాలోని శాయం పేట మండ‌లంలో ఇసుక లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ఉన్న‌ 20 మందికి తీవ్రంగా గాయాల‌య్యాయి. మ‌రో 10 మంది స్వ‌ల్పంగా గాయ‌బ‌డ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న‌టువంటి ఆస్ప‌త్రుల‌కు తర‌లించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ అతివేగంగా వాహనాన్ని నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.