TS:  ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాల‌ను విద్యామంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ప‌రీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించారు. ఇందులో 2,28,754 మంది బాలిక‌లు, 2,22,831 మంది బాలురు ఉన్నారు.

విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్‌ ఇయర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ ఫలితాలు విడుదల చేసింది.

మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 176719 మంది విద్యార్థులు ఏ-గ్రేడ్‌ కాగా.. 104886 మంది బీ గ్రేడ్‌ లో ఉత్తీర్ణులు అయ్యారు. 61,887 మంది సి-గ్రేడ్‌ కాగా.. 108093 మంది విద్యార్థులు డి గ్రేడ్‌ తో ఉత్తీర్ణత సాధించారు.

Leave A Reply

Your email address will not be published.