నీ మొగుడు గ‌బ్బ‌ర్ సింగ్ అంటగా.. నెనెవ‌రో తెలుసా..

డానియెల్ శేఖ‌ర్ ఎంట్రీ అదిరింది

ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయ‌క్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , రానా కాంబినేష‌న్ లో వ‌స్తున్న న‌టిస్తోన్న లేటెస్ట్ ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. టైటిల్‌ పాత్రని పవన్‌ కల్యాణ్‌ పోషిస్తుండగా రానా డానియల్ శేఖర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇవాళ రానా పాత్రకి సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో రానా చాలా పవర్‌ఫుల్‌గా పంచె ధరించి మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు.

‘మీ ఆయన గబ్బర్‌సింగ్‌ అని స్టేషన్‌లో టాక్‌ నడుస్తోంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర.. హీరో’ అంటూ రానా చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

ఓ వైపు భీమ్లానాయ‌క్, మ‌రోవైపు డానియెల్ శేఖ‌ర్..ఈ ఇద్ద‌రి పోటాపోటీ యాక్టింగ్ తో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయ‌మ‌ని తాజాగా విడుద‌ల చేసిన వీడియో ద్వారా అర్థ‌మ‌వుతోంది. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని 2022 జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్య మేనన్‌, రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.