Nallagonda: విక్స్ డబ్బా మింగిన పసికందు ఊపిరాడక మృతి
నార్కట్‌పల్లి (CLiC2NEWS): నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని తొండ్రాయి గ్రామంలో 7 నెలల పసికందు విక్స్ డబ్బాతో ఆడుకుంటూ ఆ డబ్బాను మింగేశాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పసికందుని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊపిరాడక దారిలోనే ఆ బాలుడు ప్రాణాలొదిలాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.