TS: రాష్ట్రంలోని 30 వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లల : మంత్రి సబితా
తుక్కుగూడ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో జల కల సంతరించుకుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువులో ఆదివారం ఉచిత చేప పిల్లలను వదిలిన సందర్భంగా మంత్రి సబిత మాట్లాడారు… తెలంగాణలోని 30 వేల చెరువుల్లో 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదిలిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇప్పటికి 5 విడుతల్లో ఉచిత చేప పిల్లలను చెరువుల్లో వదిలామని చెప్పారు.