పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవీ సింధు
న్యూఢిల్లీ (CLiC2NEWS): పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతీ సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు `పద్మ` అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో సోమవారం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు హాజరయ్యారు.
హైదరాబాదీ స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వరించింది.
అలాగే కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా.. ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు.
2020 సంవత్సరానికి ప్రభుత్వం 118 పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంట్లో ఏడు పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, మిగతా వాకిరి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
Delhi: Olympian badminton player PV Sindhu awarded the Padma Bhushan pic.twitter.com/TqUldnQgr3
— ANI (@ANI) November 8, 2021