AP: ముగిసిన నగరపాలక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్
అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 12 మున్సిపాలిటీలకు జురుగుతున్న పోలింగ్ ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 50.1% పోలింగ్ నమోదయ్యింది. బుచ్చి రెడ్డి పాలెంలో 61.6%, దాచేపల్లిలో 71.88% గురజాలలో 71.8% పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.