AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీ..
విశాఖపట్నం(CLiC2NEWS): ఎపిలోని విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 2019, 2020, 2021సంవత్సరంలలలో డిప్లొమా/ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది నవంబరు 18.
డిప్లొమా అప్రెంటిస్‌లు-50 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ , సివిల్
అర్హత: సంబంధించిన సబ్జెక్టులలో డిప్లొమా ఇంజనీరింగ్ – టెక్నాలజి ఉత్తీర్ణులయి ఉన్నవారు దరఖాస్తుచేసుకోవచ్చు. స్టయిఫండ్ నెలకు రూ. 3542 చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-100 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టయిపెండ్ నెలకు రూ.4984 చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.vizagsteel.com చూడగలరు.