TS: సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా

సిద్దిపేట(CLiC2NEWS) : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ఐఎఎస్‌కు రాజీనామా చేశారు. ఆయ‌న ఉద్యోగం నుండి స్వ‌చ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ కోరుతూ సెఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ‌ను అందించారు. ఆయ‌న రాజీనామాను ఆమోదిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంత‌రం వెంక‌ట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం కృషి చేస్తుంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చేసేలా సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి మార్గంలో సిఎంతో ఉండాల‌నుకొని విఆర్ ఎస్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. సిఎం పిలుపు వ‌చ్చాక తెరాసాలో చేర‌తానని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.