Hyderabad: ఓయూలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌

హైద‌రాబాద్(CLiC2NEWS)‌: ఉస్మానియా యూనివ‌ర్సిటిలో న‌వంబ‌రు 22వ తేదీ నుండి విడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ జిల్లా డిఎంహెచ్ఒ స‌హకారంతో యూనివ‌ర్సిటిలో రెండ‌వ‌సారి ఈ డ్రైవ్‌ను చేప‌డుతున్నామ‌ని ప్రొఫెస‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 27 వరకు ఓయూ హెల్త్‌ సెంటర్‌లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.