రేపు ఢిల్లీకి సిఎం కెసిఆర్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకుంటం
హైదరాబాద్ (CLiC2NEWS) : తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదు అని అన్నారు. కేంద్ర మంత్రులు, అధికారులను కలుస్తాం. అవకాశముంటే ప్రధానమంత్రిని కలుస్తాం. ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, మాట్లాడతామని అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినట్లు మొన్న గాలివార్త వచ్చింది. అది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు కన్ఫ్యూజన్లో ఉంటారు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నమని అన్నారు.
రైతులకు ప్రధాని సారీ చెప్తే సరిపోదు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. సాగుచట్టంపై పోరాటంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతిరైతు కుటుంబానికి తెలంగాణప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తాం. కేంద్రం కూడా ప్రతిరైతు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తాం అని సిఎం కెసిఆర్ అన్నారు