ప్రయాణికులకు శుభవార్త
పూజా స్పెషల్ రైళ్లు
విశాఖపట్నం(CLiC2NEWS): ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య పలు పూజా స్పెషల్ రైళ్లు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం ఎకె త్రిపాఠి తెలియజేశారు.
విశాఖపట్నం–సికింద్రాబాద్(08579 పూజా స్పెషల్ రైలు ప్రతి బుధవారం రాత్రి 7గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబర్ 1 నుండి 29వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08580)సికింద్రాబాద్‌లో ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది.
విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) వీక్లీ పూజా స్పెషల్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు డిసెంబరు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08586) సికిందాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 9.05గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, సత్తెనపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైళ్లు 3–థర్డ్ ఎసి, 8–స్లీపర్ క్లాస్, 6–సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్ కం లగేజ్ కోచ్‌లతో నడుస్తాయి.