భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటిడ్ (BEL)లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటిడ్ (BEL), మచిలీపట్నం యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన 15 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బిఈ/బిటెక్/ బిఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత, అనుభవం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 01.011.2021 నాటికి 28 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు డిసెంబరు 24వ తేదీ వరకు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.bel-india.in/ చూడగలరు.
పోస్టులు 15
విభాగాల వారీగా ఉన్న ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6, కంప్యూటర్ సైన్స్ 3.