గంటలో పెళ్లి.. నగదు, బంగారంతో వరుడు పరారీ
సంగారెడ్డి (CLiC2NEWS): మూడుముళ్ల బంధంతో మరికొద్ది సేపట్లో ఒక్కటవ్వాల్సిన జంట.. అంతలోనే వరుడు నగదు.. బంగారంతో పారిపోయాడు. దాంతో ఆ పెండ్లి ఆగిపోయింది. ఈ ఘటనతో ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఘటనతో స్నేహితులు, బంధుమిత్రులతో బాజాభజంత్రీలతో సందడిగా ఉండాల్సి న ఆ పెండ్లి మంటం ఒక్కసారిగా మూగబో్యింది.
వివరాల్లోకి వెళ్లే.. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. అయితే మరికాసేపట్లో పెండ్లి జరుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.