అమ్మాయిల వివాహ వయసు ఇక 21 ఏళ్లు!
ఢిల్లి (CLiC2NEWS): అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లనుండి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించనట్లు వెల్లడించింది. అబ్బాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, అమ్మయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లు అనే చట్టం ఉన్నా.. అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య ఉన్న వివాహ వయసు అంతరం తొలగించాలని వచ్చిన అభ్యర్థనల మేరకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
అమ్మాయిల కనీస వివాహవయసు తక్కవగా ఉండటం వలన వారి కెరీర్‌కు అవరోధంగా మారుతుందని, చిన్న వయసులో గర్భదారణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ వయసు అంతరం తొలగించాలని అభ్యర్థనలు రావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం గత సంవత్సరం నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించిన పిదప, వాటిని పరశీలించి కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈప్రతి పాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.