పుష్ప సినిమా ‘5వ షో’.. ‌ తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి

‌హైద‌రాబాద్‌ (CLiC2NEWS): అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా మ‌రికొన్ని గంట‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మంచి ఆఫ‌ర్ ఇచ్చింది. పుష్ప చిత్రం 5వ షో డిసెంబ‌రు 17 వ‌తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు అద‌న‌పు షో ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చ‌ని  అనుమ‌తినిచ్చింది. ఈచిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక‌, కీల‌క పాత్ర‌ల్లో సునీల్ అన‌సూయ క‌నిపించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.