దేశంలో 70కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం నాటికి 70 కి పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ప‌ది రాష్ట్రాల‌లో ఈ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఒక్క మ‌హారాష్ట్రలోనే ఒమిక్రాన్ సోకిన వారు 32 మంది ఉన్నారు. రాజ‌స్థాన్‌లో 17 కేసులు న‌మోద‌య్యాయి. రానున్న రోజుల‌లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై కేంద్ర హోంశాఖ స‌మీక్ష నిర్వ‌హించింది. దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ రోజుకి 7వేల కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని , గ‌డిచిన 24 గంట‌ల్లో 343 మంది క‌రోనాతో మృతి చెందార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.