14 ఏళ్ల లోపు చిన్న‌పిల్ల‌ల‌చే ప‌నిచేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు..

తెలంగాణ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ

‌హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం 14 సంవ‌త్స‌ర‌ముల‌లోపు పిల్ల‌ల‌చేత‌ ఎవ‌రైనా ప‌నిచేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆరు నెల‌ల నుండి ఏడాది జైలు శిక్ష‌తో పాటు రూ. 20వేలు నుండిరూ. 50 వేల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు. బాల కార్మిక నిర్మూల‌న కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక వేళ పిల్ల‌ల త‌ల్లిదండ్రులే ప‌నికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులవుతార‌ని స్ప‌ష్టం చేసింది. పిల్ల‌ల‌ను హానిక‌ర‌మైన ప‌నులు,ఆదాయం వ‌చ్చేలా ప‌రిశ్ర‌మ‌ల‌లో వినియోగించ‌రాద‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.