భార‌త ప్ర‌ధానమంత్రికి భూటాన్ అత్యున్న‌త పుర‌స్కారం..

థింపు (CLiC2NEWS): భార‌త ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోడికి భూటాన్ దేశ అత్యున్న‌త పౌర‌పుర‌స్కారం ‘నాడ‌గ్ పెల్ గి ఖోర్లో’ (Nadal pel gi khorlo ) ప్ర‌క‌టించింది. భూటాన్ దేశం నేష‌న‌ల్ డే సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధానమంత్రికి ఈ అవార్డును ప్ర‌క‌టించింది. భూటాన్ రాజు ఆదేశాల మేర‌కు భార‌తప్రధాని న‌రేంద్ర‌మోడికి భూటాన్ దేవ అత్యున్న‌త పౌర‌పుర‌స్కారాన్ని ప్ర‌క‌టిస్తున్నామ‌ని, ఆయ‌న అందిస్తున్న స్నేహ‌పూర్వ‌క స‌హ‌కారం, క‌‌రోనా స‌మ‌యంలో ఆయ‌న అందించిన మ‌ద్ద‌తుకు గుర్తింపుగా ఈ అత్యున్న‌త పుర‌స్కారం అందిస్తున్నామ‌ని, ఈ అవార్డుకు మీరు అర్హులు , మీరాక కోసం ఎదురుచూస్తున్నామ‌ని భూటాన్ ప్ర‌ధాని కార్యాల‌యం నుండి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. భూటాన్ దేశ ప్ర‌ధాన‌మంత్రి లొట‌య్ షెరింగ్ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.