సంగారెడ్డి: షార్ట్ స‌ర్కూట్‌తో రెండు బ‌స్సులు ద‌గ్ధం!

గుమ్మ‌డిద‌ల (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా లో రెండు బ‌స్సులు ద‌గ్ధ‌మ‌య్యాయి. జిల్లాలోని గుమ్మ‌డిద‌ల మండ‌లం అన్నారం గ్రామ ప‌రిధిలో గ‌ల మాక్స‌న్ ప‌రిశ్ర‌మ‌లో పార్కింగ్ చేసిన రెండు బ‌స్సులు ద‌గ్ధ‌మ‌య్యాయి. ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం తెలిపిన వివ‌రాల మేర‌కు కార్మికుల‌ను తీసుకొచ్చి డ్రాప్ చేసిన త‌ర్వాత బ‌స్సు డ్రైవ‌ర్లు భోజ‌నానికి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.