వి ఎస్ యు లో ప్రత్యేక ప్రాంగణ స్వచ్చ భారత్ ప్రోగ్రాం
క్యాంపస్ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత-రిజిస్ట్రార్
నెల్లూరు (CLiC2NEWS): విఎస్యులో స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ సేవా పథకం మరియు హాస్టల్ వార్డెన్స్ సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం లో రిజిస్ట్రార్ డా.ఎల్ విజయ కృష్ణ రెడ్డి పాల్గొని శ్రమదానం చేశారు. పీనాకిని బాలుర వసతి గృహము మరియు స్వర్ణముఖి బాలికల వసతి గృహాల ప్రాంగణం మరియు పరిసరప్రాంతాలలో శ్రమదానం చేసి చెత్తను శుభ్రపరచారు. అందరూ బాధ్యతతో వి ఎస్ యూ క్యాంపస్ ను సొంతం చేసుకొని క్యాంపస్ లో పరిశుభ్రత మరియు పారిశుధ్యం మెరుగగా వుడేటట్లు చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డిప్యూటీ వార్డెన్స్, డా.ఆర్ ప్రభాకర్, ఎన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.వై.విజయ, డా.శ్రీకన్య రావు మరియు అధ్యపకేతర సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు