టెన్నిస్ కోర్ట్ ను ప్రారంభించిన సిపి చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో సింథటిక్ కోర్టు, ఫ్లెడ్ లైట్స్ ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్ట్ ను రామగుండం పోలీస్ కమిషనర్  ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇంత మంచి టెన్నిస్ కోర్ట్ కి కృషి చేసిన, సహాయ సహకరాలు అందించిన సింగరేణి వారికి, HRKK, ఏన్టీపీసీ వారికి కోర్ట్ నిర్మాణం కి పనిచేసిన ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, శ్రీరాంపూర్ సీఐ రాజు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మి నారాయణ,ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ అధికారులకు, సిబ్బంది, పిల్లలు, స్థానిక క్రీడాకారులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్,ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్,ఆర్ఐ లు మధుకర్,శ్రీధర్, విష్ణు ప్రసాద్, సిసి శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ఐ లు, స్థానిక క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.