దేశంలోకి అక్ర‌మంగా డ్రోన్‌ల‌తో బాంబులు..

ట్రైమ‌ర్ సెట్‌చేసిన బాంబులను డ్రోన్‌ల ద్వారా ర‌వాణా

జ‌మ్మూ (CLiC2NEWS): వాయు మార్గంలో దేశంలోకి అక్ర‌మంగా పేలుడు ప‌దార్థాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు పాకిస్థాన్ ముష్క‌రులు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను జ‌మ్మూ పోలీసులు భ‌గ్నం చేశారు. స‌రిహ‌ద్దుల్లో అలాంటి ఓ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జ‌రిపారు. డ్రోన్ నుంచి జార‌విడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఇడి బాంబుల‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటికి టైమ‌ర్ కూడా సెట్ చేసి ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు. బాంబాల‌ను నిర్వీర్యం చేసి ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని ముకేశ్ సింగ్ వెల్ల‌డించారు. గ‌త నెలాఖ‌రులో క‌తువాలోని తాల్లీ హరియాచాక్ గ్రామం వ‌ద్ద ఓ క్వాడ్ కాప్ట‌ర్‌ను జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు కూల్చివేశారు. అందులో ఏడు మ్యాగ్న‌టిక్ బాంబులు, ఏడు యూజిబిఎల్ గ్ర‌నేడ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.