లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి (CLiC2NEWS): నిన్న ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటలో దూసుకువెళ్తున్నాయి. కాగా గత వారం భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్ లకు ఈ వారం కొంత ఉపశమనం లభిస్తోంది. అలాగే ఆసియా-పసిపిక్ సూచీలు కూడా భారీ లాభాల్లో దూసుకువెళ్తున్నాయి. దానికి తోడు యుఎస్ ఫ్యూచర్స్ సైతం సానుకూలంగా ఉన్నాయి. అలాగే దేశీయంగా కీలక కంపెనీల షేర్లన్నీ రాణిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో సెన్సెక్స్ 1012 పాయింట్లు ముందుకు దూసుకువెళ్లి 52,610 వద్ద రాణిస్తోంది. నిఫ్టీ 303 పాయింట్లు లాభపడి 15,653 వద్ద ట్రెండవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.