వికారాబాద్ జిల్లాలో నీట మునిగిన బ‌స్సు!

ప్ర‌యాణికులంతా సుర‌క్షితం!

వికారాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ బోర‌బండకు చెందిన పెళ్లి బ‌స్సు వికారాబాద్ జిల్లా బ‌ర్వాడ్ గ్రామం కోట‌ప‌ల్లి మండ‌లం లో ని కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీటిలో చిక్కుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల మేకు సోమ‌వారం హైద‌రాబాద్ బోర‌బండ‌కు చెందిన ఓ పెండ్లి బృందం బ‌స్సు కోట‌ప‌ల్లి మండ‌లంలో వివాహ వేడుకుకు హాజ‌రై.. తిరుగు ప్ర‌యాణంలో రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో కేసారం రైల్వేబ్రిడ్జి కింద నీటిలో చిక్కుకుపోయింది.
కాగా ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో ఉన్న‌వారంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారే స‌రికి పెద్ద ఎత్తున వ‌ర్ష‌పునీరు చేర‌డంతో బ‌స్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.