గట్టెక్కిన రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం

గట్టెక్కిన రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం

జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు.ె గహ్లాట్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు నోటీసు ఇచ్చింది.దానిని స్పీకర్ సిపి జోషి ఆమోదించి చర్చ పెట్టారు. తదుపరి మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గిందని స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సమ్మతి నేత సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా ఉందని అన్నారు. పైలట్ 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన నేపధ్యంలో ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.

రాజస్థాన్‌లో రాజకీయ హైడ్రామాకు ఎట్టేకలకు తెరపడింది. వివాదానికి మూలకారకులైన సీఎం గెె్లత్, సచిన్ పైలట్‌ల మధ్య సయోధ్య కుదరడంతో చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసుకున్నారు. సీఎం గెె్లత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశంలో వీరిద్దరూ ‘చేతులు’ కలిపారు. ‘సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత అసమ్మతిని మరిచిపోయి రాష్ర్టం, దేశం, ప్రజల కోసం కలిసి ముందుకెళదాం’ అని గెె్లత్ ట్వీట్ చేశారు.

అందుకు అనుగుణంగానే సీఎల్పీ భేటీకి వచ్చిన సచిన్‌ను సాదరంగా ఆహ్వానించిన గెె్లత్.. ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. అయితే రాజస్థాన్ బీజేపీ గెె్లత్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. గురువారమిక్కడ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో గెె్లత్ నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా చెప్పారు. మాజీ సీఎం వసుంధర రాజే, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం నుంచి జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కటారియా తెలిపారు.

రాష్ర్టంలో పెరుగుతున్న కరోనా కేసులు, దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారనే ఆరోపణలపై ఎస్‌వోజీ చేసిన అరెస్టు అంశాలను సభలో ప్రస్తావిస్తామని కటారియా మీడియాకు వివరించారు. అయితే సభలో తామే బలపరీక్షకు వెళ్తామని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రే సభలో విశ్వాస పరీక్షకు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇతర సభ్యులు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకోరు.

సీఎం అశోక్ గెె్లత్‌కు మరో ఊరట లభించింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెసలో విలీనం చేసుకున్న అంశంపై ప్రస్తుతం తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న రాజస్థాన్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు గెె్లత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భన్వరిలాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను పార్టీ ఎత్తేసింది.
సచిన్ పైలట్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.