థాయిలాండ్ డే కేర్ సెంటర్ ఘటన: దుండగుడు ఆత్మహత్య!
బ్యాంకాక్ (CLiC2NEWS): థాయిలాండ్‌లోని డేకేర్ సెంటర్లో ఓ దుండగుడు జరిపిన కాల్పులలో 34 మంది మృతిచెందారు. ఆ కాల్పులు జరిపిన నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాంపూ పట్టణంలో ఓ డే కేర్ సెంటర్లో దుండగుడు బహిరంగ కాల్పులు జరిపి మారణహోమం సృష్టించాడు. ఈ ఘటనలో నిండు గర్భిణి, చిన్నారులుతో సహా మొత్తం 34 మంది మృత్యువాత పడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పాన్య ఖమ్రాఫ్ అనే మాజీ పోలీస్ అధికారి తప్పించుకొని పోయి తన కుటుంబాన్ని కూడా చంపి, బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.