విమానంలో ప‌వ‌ర్ బ్యాంక్ పేలుడు!

చండీగ‌ఢ్ (CLiC2NEWS): ఇండిగో విమానంలో ప్ర‌యాణికుడికి చెందిన ప‌వ‌ర్  బ్యాంక్ పేలి, మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న చండీగ‌ఢ్ విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం  హైద‌రాబాద్ నుండి చండీగ‌ఢ్ చేరుకున్న ఇండిగో విమానంలో దాదాపు 200 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ల్యాండ్ అయిన అనంత‌రం ఓ ప్ర‌యాణికుడి ప‌వ‌ర్‌బ్యాంక్ నుండి మంట‌లు చెల‌రేగిన‌ట్లు గుర్తించాడు. వెంట‌నే సిబ్బందికి స‌మాచారం తెలియ‌ప‌రిచాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది.. హుటాహుటిన ప్ర‌యాణికులంద‌రినీ అత్య‌వ‌స‌ర ద్వారం ద్వారా  సుర‌క్షితంగా దించారు. మంట‌ల‌ను అగ్నిమాప‌క ప‌రిక‌రాల‌తో ఆర్పేశారు.

Also Read: యూట్యూబ్‌లో శోధించి.. భార్య‌ను హ‌త్య‌చేసిన భ‌ర్త‌

Leave A Reply

Your email address will not be published.