యూట్యూబ్‌లో శోధించి.. భార్య‌ను హ‌త్య‌చేసిన భ‌ర్త‌

ప్రొద్దుటూరు (CLiC2NEWS): యూట్యూబ్‌లో భార్య‌ను హ‌త్య చేయ‌డం ఎలా.. అని శోధించి, త‌న భార్య‌ను హ‌త్య చేసేందుకు ప‌త‌కం వేశాడు భ‌ర్త‌. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత ప‌ద్మ‌జ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. ఈ కేసులో ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు వివాహిత భ‌ర్తేన‌ని నిర్ధారించి, అరెస్టు చేశారు. అత‌డిని విచారించ‌గా కీల‌కమైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

కిర‌ణ్ .. త‌న భార్య లావుగా ఉందని, త‌న‌ను ప్ర‌తి నిత్యం అనుమానిస్తోంద‌నే కార‌ణాల‌తో ఆమెను హ‌త్య చేసేందుకు నిర్ణ‌యించుకున్నాడు. దీనికోసం ఎలా హ‌త్య చేయాల‌ని యూట్యూబ్‌లో వెతికాడు. రూ. 80వేలు ఖ‌ర్చుచేసి హైద‌రాబాద్ నుండి విషాన్ని కొరియ‌ర్ ద్వారా తెప్పించుకున్నాడు. దానిని గ‌త నెల 29వ తేదీన పాల‌కోవాలో క‌లిపి భార్య‌కు ఇచ్చాడు. పాల‌కోవా తిన్న కిర‌ణ్ భార్య అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. అనంత‌రం ఆమె ముఖంపై దిండుతో నొక్కాడు. త‌ర్వాత ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. త‌న భార్య ఎలా చ‌నిపోయిందో త‌న‌కేమీ తెలియ‌న‌ట్టు అక్క‌డ న‌టించాడు. ప‌ద్మజ‌ శ‌రీరంపై ఎలాంటి గాయాలు లేక‌పోవ‌డంతో పోలీసుల‌కు అనుమానం వచ్చింది. దీంతో భ‌ర్త కిర‌ణ్‌ను విచారించ‌గా అస‌లు విష‌యం వెలెగులోకి వ‌చ్చింది.

 

రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి

Leave A Reply

Your email address will not be published.