రూ. 3.5 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు..
భద్రాద్రి (CLiC2NEWS): భద్రాచలం అటవీశాఖ అధికారులు ఎఫ్‌డిఒ, చర్ల ఇన్‌ఛార్జి డిఆర్ ఒ.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబికి పట్టుబడ్డారు. రోడ్డు పనుల్లో చెట్లు తొలగిండంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డిఒ సుజా రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే గురువారం ఎప్‌డిఒ సుజాత, చర్ల ఇన్‌ఛార్జి డిఆర్ ఒ కృష్ణయ్య రూ. 3.5లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి రమేశ్ ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి