పదోతరగతి విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు
ఖమ్మం (CLiC2NEWS): పట్టణంలోని క్రియేటివ్ గ్రామర్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గురువారం యోగా గురువు బహార్ అలీ యోగ ప్రాణాయామం శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు టెన్త్ క్లాస్ కామన్ ఎగ్జామ్స్ చక్కగా రాసుకోవటానికి.. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించుకోవడానికి, పిల్లల ఏకాగ్రతకు, జ్ఞాపకశక్తి పెంపొంది, చదువుకున్నది చక్కగా గుర్తుంచుకోవడానికి, మెదడు చైతన్యవంతానికి, శారీరక మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా ఉపయోగపడుతుందని.. యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్య్రమంలో
స్కూల్ యాజమాన్యం కమలాకర్ రావు , ఇతర ఉద్యోగులు.. పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ యోగ ప్రాణయామం శిక్షణ చక్కగా నేర్చుకున్నారు.