బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి: పెద్ద‌ప‌ల్లి డిసిపి

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS) : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేర‌కు పెద్ద‌ప‌ల్లి డిసిపి వైభ‌వ్ గైక్వాడ్ అధికారుల‌తో స‌మీక్ష‌ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న ఆప‌రేష‌న్ ముస్కాన్ నిర్వ‌హ‌ణ గురించి స‌మావేశంలో చ‌ర్చించారు. ఆపరేషన్ ముస్కాన్ -IX లో భాగంగా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. హాట్ స్పాట్స్ పై నిఘా ఉంచాల‌ని.. గతంలో రిస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాల‌న్నారు. 18 సంవత్సరాల లోపు పిల్ల‌లు బాలకార్మికులుగా పని చేస్తున్నా.. గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణ షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలొ పని చేసిన, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించాలి. లేదా స్టేట్ హోమ్ కు పంపించడం చేయాలన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయిస్తే.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాల‌న్నారు.

జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను  చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని డిసిపి తెలిపారు.

1 Comment
  1. sbo bet says

    Having read this I believed it was very enlightening.
    I appreciate you finding the time and effort to put this content together.
    I once again find myself spending way too much time both reading and posting comments.
    But so what, it was still worthwhile!

Leave A Reply

Your email address will not be published.