TS: అంగన్వాడి టీచర్లకు గుడ్న్యూస్
హైదారాబాద్ (CLiC2NEWS):
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మిని కేంద్రాలను ప్రధాన అంగన్వాగీ కేంద్రాలుగా చేసింది. అంతేకాకుండా ఉద్యోగ పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ జిఒను జారీ చేఇసంది. ప్రత్యేక ఆర్ధిక సాయం కింద పదవీ విరమణ చేసే టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50వేలు భృతిని అందజేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విరమణ అనంతరం ఆసరా పెన్షన్కూడా మంజూరు చేయనుంది.