ఇక నుండి ప్ర‌తి మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ప్ర‌జావాణి..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఇక నుండి ప్ర‌జాద‌ర్బార్‌.. ప్ర‌జావాణిగా పిల‌వ‌బ‌డుతుంది. ప్ర‌జాద‌ర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి మంగ‌ళ‌, శుక్ర‌వారం నాడు ప్ర‌జావాణి నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. న‌గ‌రంలోని జ్యోతిబాపూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్ర‌జాద‌ర్బార్ డిసెంబ‌ర్ 8వ తేదీన ప్రారంభించారు. ఈ కార్య‌క్రమంలో ప్ర‌జ‌లు త‌మ‌కు సంబంధించిన వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,471 విన‌తి ప‌త్రాలు అందిన‌ట్లు స‌మాచారం. వీటిలో ఎక్క‌వ శాతం డ‌బుల్‌బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛ‌న్ల‌కు సంబంధించిన‌వి ఉన్న‌వి. సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో 1,143 విన‌తి ప‌త్రాలు అందిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.