హిమపాతంలో చిక్కుకున్న వెయ్యి మందికిపైగా ర‌క్షించిన ఇండియ‌న్‌ ఆర్మీ

గాంగ్‌ట‌క్ (CLiC2NEWS): ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన చ‌లి తీవ్ర‌త అధికంగా ఉంటుంది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈ ప్ర‌భావం ఇంకా అధికంగా ఉంది. మంచు భారీ కురుస్తుండ‌టంతో ఢిల్లీ, ఉత్త‌రాఖండ్‌, జ‌మ్యుక‌శ్మీర్, సిక్కిం త‌దిత‌ర రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌స్థాయిలో ఉంది. మంచు ఎక్కువ‌గా కుర‌వ‌డంతో తూర్పు సిక్కింలోని ప‌ర్వ‌త సానువుల్లో చిక్కుకుపోయిన 1,217 మంది ప‌ర్యాట‌కులు చిక్కుకుపోయారు. చ‌లికి త‌ట్టుకోలేక చాలామంది స్పృహ కోల్పోయారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఇండియ‌న్ ఆర్మీ అప‌రేష‌న్ చేప‌ట్టి అంద‌రిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ప‌ర్యాట‌కుల‌లో మ‌హిళ‌లు, చిన్నారులు, వ‌యోవృద్ధులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. బుధ‌వారం సాయంత్రం నుండి గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. వారికోసం ప్ర‌త్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. ఆహారం, వైద్య స‌దుపాయాలు సైతం క‌ల్పించారు. ఈ మేర‌కు ఆర్మీ ఉన్న‌తాధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Leave A Reply

Your email address will not be published.