Sangareddy: ఎస్‌బి ఆర్గానిక్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
హత్నూర (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పరిశ్రమలోని బాయిలర్ పేలి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో సహా మరో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.